Share News

రిటైర్డ్‌ ఐపీఎస్‌ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత

ABN , Publish Date - Oct 31 , 2026 | 05:45 AM

పోలీసు శాఖలో మూడు దశాబ్దాలకు పైగా వివిధ హోదాల్లో పనిచేసి కీలక విభాగాలకు నాయకత్వం వహించిన రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఎన్‌. బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన అమెరికాలో చికిత్స పొందుతూ అక్కడే కన్నుమూశారు.

రిటైర్డ్‌ ఐపీఎస్‌ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత

అమెరికాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ సంతాపం

అమరావతి/విజయవాడ(బ్‌సస్టేషన్‌), అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలో మూడు దశాబ్దాలకు పైగా వివిధ హోదాల్లో పనిచేసి కీలక విభాగాలకు నాయకత్వం వహించిన రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఎన్‌. బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన అమెరికాలో చికిత్స పొందుతూ అక్కడే కన్నుమూశారు. 1994 బ్యాచ్‌కు చెందిన ఆయన శిక్షణ తర్వాత గ్రేహౌండ్స్‌లో అసాల్ట్‌ కమాండర్‌గా బాధ్యతలు చేపట్టారు.ఇంటెలిజెన్స్‌, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, రవాణాశాఖ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది ఆగస్టు 31న ఆర్టీసీ ఎండీగా ఉద్యోగ విరమణ చేశారు. బీటెక్‌ చదివిన బాలసుబ్రహ్మణ్యం కరీంనగర్‌ ఏఎస్పీగా, నల్లగొండ, ప్రకాశం జిల్లాల ఎస్పీగా పనిచేశారు.

ఆయన మృతిపట్ల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాతో పాటు పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు నివాళులు అర్పించారు. కాగా, బాలసుబ్రహ్మణ్యం మృతి తీరని లోటు అని ఆర్టీసీ చైర్మన్‌ కొణకళ్ల నారాయణరావు అన్నారు. ఆర్టీసీ కార్యాలయంలో బాలాసుబ్రహ్మణ్యం చిత్రపటానికి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నివాళులు సమర్పించారు. బాలాసుబ్రహ్మణ్యం మృతి పట్ల ప్రజా రవాణా సంస్థ నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు సంతాపం తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 05:45 AM