వరదల్లో కృష్ణా జిల్లా వాసి గల్లంతు
ABN , Publish Date - Aug 28 , 2026 | 06:13 AM
కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం యాకమూరుకు చెందిన చొప్పరపు రమేశ్‌బాబు ఖతర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నారు.
మచిలీపట్నం, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం యాకమూరుకు చెందిన చొప్పరపు రమేశ్‌బాబు ఖతర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నారు. ఆయన కుటుంబం పెనమలూరు మండలం కానూరులో స్థిరపడింది. రెండు వారాల క్రితం స్నేహితుని పెళ్లి కోసం విజయవాడ వచ్చారు. ఈ నెల 16న తిరిగి ఖతర్ వెళ్లారు. నేపాల్ యాత్ర కోసం రమేశ్ ముంబై చేరుకుని, అక్కడ హిల్డన్ హిల్స్ అనే బృందంతో కలిసి మానస సరోవర యాత్ర కోసం వెళ్లారు. నేపాల్‌లో వరద విపత్తు సంభవించిన బుధవారం ఉదయం 8.15 గంటల నుంచి రమేశ్‌బాబు సెల్‌ఫోన్ పనిచేయడం లేదని కృష్ణా జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమాచారం వచ్చింది. అయితే, రమేశ్‌బాబు క్షేమంగానే ఉన్నారని ఆయన బంధువులు చెబుతున్నారు.