రాప్తాడు జడ్పీ పాఠశాలకు 30 మందే హాజరు
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:27 AM
విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన జరిగి మూడు రోజులవుతున్నా.. అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులను ఇంకా భయం వెంటాడుతూనే ఉంది..!
పాఠశాలకు వెళ్లేందుకు జంకుతున్న విద్యార్థులు
అనంతపురం విద్య, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన జరిగి మూడు రోజులవుతున్నా.. అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులను ఇంకా భయం వెంటాడుతూనే ఉంది..! ముఖ్యంగా పదో తరగతి విద్యార్థినులపై ఈ దాడి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సంఘటన శనివారం జరిగింది.. ఆదివారం సెలవు. మరుసటి రోజు సోమవారం ఉదయం తొలి గంటలో 9 మంది విద్యార్థులే పాఠశాలకు వచ్చారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా రావడంతో హాజరు 30కి చేరింది. దాడి నేపథ్యంలో విద్యార్థులు బడికి వచ్చేందుకు జంకుతున్నారు.
తల్లిదండ్రులు సైతం పిల్లలను బడికి పంపడానికి ఆసక్తి చూపడం లేదు. ఉపాధ్యాయులు అందరూ సోమవారం ఉదయం పాఠశాలకు వచ్చినా... విద్యార్థులు చాలామంది రాలేదు. ఈ పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి ఉంది. మొత్తం 358 మంది విద్యార్థులు, 22 మంది టీచర్లు ఉన్నారు. పిల్లలు బడికి వస్తే కౌన్సిలింగ్ ఇచ్చేందుకు 20మంది మానసిక కౌన్సిలర్లతో సమగ్రశిక్ష ఏపీసీ శైలజ పాఠశాలకు వచ్చారు. అయితే పిల్లలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో టీచర్లు, కౌన్సిలర్లు అయోమయంలో పడిపోయారు. వచ్చిన విద్యార్థులను ఉపాధ్యాయులు ఒకే గదిలో కూర్చొబెట్టుకుని గడిపారు. కౌన్సిలర్లు వారితో మాట్లాడి.. ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి