నేడు రాప్తాడు ఉన్మాది డిశ్చార్జ్
ABN , Publish Date - Nov 18 , 2026 | 04:54 AM
అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడికి పాల్పడిన నిందితుడు హేమంత్‌ను బుధవారం డిశ్చార్జ్ చేస్తున్నట్లు...
కర్నూలు జీజీహెచ్‌లో మెరుగైన చికిత్స
కర్నూలు హాస్పిటల్, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడికి పాల్పడిన నిందితుడు హేమంత్‌ను బుధవారం డిశ్చార్జ్ చేస్తున్నట్లు కర్నూలు జీజీహెచ్ వైద్యు లు తెలిపారు. పోలీసు కాల్పుల్లో తీవ్రం గా గాయపడిన నిందితుడికి కోర్టు ఆదేశాల మేరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు మెరుగైన చికిత్స అందించారు.
నాలుగు రోజులుగా కార్డియాలజీ ఐసీయూలో ఉంచి చికిత్స చేశా రు. ఆ వివరాలతో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు నివేదికను రూపొందించి అనంతపురం జిల్లా న్యాయాధికారికి పంపనున్నారు. నిందితుడి బీపీ, పల్స్‌రేట్ సాధారణంగా ఉ న్నాయని, కాలి గాయం కూడా మానిందని సూపరింటెండెంట్ వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు