Share News

అందరికీ ధన్యవాదాలు

ABN , Publish Date - Nov 26 , 2026 | 03:40 AM

అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన పాశవిక దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని మృత్యువుతో పోరాడి గెలిచింది.

అందరికీ ధన్యవాదాలు

  • నా ప్రాణాలు కాపాడేందుకు కష్టపడ్డారు

  • రాప్తాడు బాలిక తొలి స్పందన

  • పూర్తిగా కుదుటపడిన ఆరోగ్యం

  • బెంగళూరు మణిపాల్‌ ఆస్పత్రిలో వేడుక

  • కేక్‌ కట్‌ చేయించిన వైద్యులు, సిబ్బంది

  • ‘ఎక్స్‌’లో ఫొటోలు పోస్టు చేసిన లోకేశ్‌

  • నా ప్రాణాలు కాపాడేందుకు కష్టపడ్డారు.. రాప్తాడు బాలిక తొలి స్పందన

అమరావతి, అనంతపురం వైద్యం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన పాశవిక దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని మృత్యువుతో పోరాడి గెలిచింది. బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. విద్యార్థినిలో మానసిక ఉల్లాసం, ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఆస్పత్రిలోని పీడియాట్రిక్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌ బృందం బుధవారం వేడుకను నిర్వహించింది.

ఆ బాలిక ఉంటున్న గదిని బంగారు వర్ణపు బెలూన్లతో అందంగా అలంకరించారు. వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది గిటార్‌తో మధురమైన సంగీతాన్ని వినిపించి బాలికను ఉత్సాహపరిచారు. అనంతరం తల్లిదండ్రుల సమక్షంలో బాలిక స్వయంగా నిలబడి కేక్‌ కట్‌ చేసి వైద్యులకు తినిపించింది. ఇన్నాళ్లూ తీవ్రమైన నొప్పితో బాధపడిన బాలిక తిరిగి తన కాళ్లపై తాను నిలబడి, నవ్వుతూ కేక్‌ కట్‌ చేయడం విశేషం.


ఘటన అనంతరం ఈ సందర్భంగా తొలిసారి ఆ అమ్మాయి మాట్లాడుతూ... ‘నా ప్రాణాలు కాపాడేందుకు కష్టపడిన వారందరికీ వెరీ వెరీ థ్యాంక్స్‌’ అని చెప్పింది. చిన్న చిన్న ఆత్మీయ చర్యలు రోగుల మానసిక స్థితిలో పెద్ద మార్పును తీసుకొస్తాయని వైద్యులు అన్నారు. బాలిక పూర్తి ఆరోగ్యంతో ఇంటికి త్వరగా తిరిగి వెళ్లాలని ఆకాంక్షించారు.

ఈ ఫొటోలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. ‘చిన్న చిన్న చర్యలే ఎంతో గొప్ప మార్పును తీసుకొస్తాయి. బాలికలో మనోధైర్యాన్ని పెంచేందుకు ఆమె గదిలో కేక్‌ కటింగ్‌, సంగీత కార్యక్రమం ఏర్పాటు చేసిన బృందానికి ధన్యవాదాలు. బాలిక త్వరగా కోలుకుని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నా’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Updated Date - Nov 26 , 2026 | 03:43 AM