Share News

వరద నీటిలోనే రామేశ్వరస్వామి ఆలయం

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:27 AM

పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన నత్తారామేశ్వరంలోని రామేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం వరద నీటి కారణంగా వారం రోజులుగా జలదిగ్భందనంలో ఉంది.

వరద నీటిలోనే రామేశ్వరస్వామి ఆలయం

  • వారం రోజులుగా జలదిగ్భందనంలో ప్రాంగణం

  • కార్తీక మాసంలో దర్శనాలు నిలుపుదల

పెనుమంట్ర/తణుకు, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన నత్తారామేశ్వరంలోని రామేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం వరద నీటి కారణంగా వారం రోజులుగా జలదిగ్భందనంలో ఉంది. దీంతో మంగళవారం కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా స్వామి వారిని దర్శించుకోవాలని వచ్చిన భక్తులకు నిరాశ ఎదురైంది. గోస్తనీ నది ఒడ్డున ఉండే పార్వతీ సమేత రామేశ్వరస్వామి, పరశురాముడు ప్రతిష్టించిన రామలింగేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో పూజారులు ఆ వరద నీటిలోనే వెళ్లి నీటిలో మునిగిన శివలింగానికి అభిషేకాలు, మహా నివేదన సమర్పిస్తున్నారు. ఇక జుత్తిగలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కామాక్షీ అమ్మవారి ఆలయంలోకి నీరు వచ్చి చేరింది.

వర్షం నీటిలోనే తణుకు బస్టాండ్‌

తణుకు ఆర్టీసీ బస్టాండ్‌ వారం రోజులుగా నీటిలోనే మునిగి ఉంది. రెండు తుఫాన్లతో లోతట్టు ప్రాంతంలో ఉండే బస్టాండ్‌ను వరద నీరు ముంచెత్తింది. దీంతో బస్టాండ్‌ పక్కనే ఉన్న ఫ్లైఓవర్‌ కింద కుర్చీలు ఏర్పాటు చేసుకొని.. అక్కడి నుంచి ఆర్టీసీ కార్యకలాపాలు సాగిస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 05:28 AM