Share News

జైలులో మత ప్రచారం..!

ABN , Publish Date - Nov 19 , 2026 | 01:21 AM

రాజమహేంద్రవరం మహిళా ప్రత్యేక కారాగారంలో అధికారులు మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిసింది. నాలుగు గోడల మధ్య ఉన్న మహిళా ఖైదీలకు వివిధ రకాల ఆశలు చూపి...

జైలులో మత ప్రచారం..!

  • స్వయంగా ప్రచారానికి దిగిన రాజమహేంద్రవరం మహిళా కారాగారం సూపరింటెండెంట్‌ వసంత కుమారి

  • హిందూ ఖైదీలు, సిబ్బందిపై వేధింపులు

రాజమహేంద్రవరం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం మహిళా ప్రత్యేక కారాగారంలో అధికారులు మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిసింది. నాలుగు గోడల మధ్య ఉన్న మహిళా ఖైదీలకు వివిధ రకాల ఆశలు చూపి క్రైస్తవంలోకి వెళ్లేలా ప్రేరణ కలిగిస్తున్నట్టు సమాచారం. ఈ జైలులో మహిళా ఖైదీలు సుమారు 70 మంది, సిబ్బంది దాదాపు 30 మంది ఉంటారు. క్రైస్తవాన్ని ఆచరించే సూపరింటెండెంట్‌... ఆ మతస్తులను ఆప్యాయంగా, ఇతరులను ముఖ్యంగా హిందువులను వేధింపుల ధోరణితో చూస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఇబ్బంది సిబ్బందికీ తప్పడం లేదు. ఖైదీల అవసరాలను ఆధారం చేసుకొని ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.

బెయిల్‌ త్వరగా వస్తుందని, ఆరోగ్యం త్వరగా కుదుట పడుతుందని, మంచి సదుపాయాలు ఉంటాయని చెబుతూ మతం మారేలా ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. మత మార్పిడి చేయడానికి 20 మంది ఖైదీలను సిద్ధం చేయడం జైలులో కలకలం రేపుతోంది. ఓ చర్చి పేరుతో కొద్ది రోజుల క్రితం వాట్సాప్‌ గ్రూపుల్లో ఒక పోస్టర్‌ విస్తృతంగా తిరిగింది. ఆ పోస్టర్‌లో సోల్జర్స్‌ ఫర్‌ జీసస్‌- జైళ్ల శాఖ- సహవాస ఆత్మీయ కలయిక అని ముద్రించారు.

ఆ పోస్టర్‌ను సాక్షాత్తూ సూపరింటెండెంట్‌ వసంత కుమారి ప్రచారం చేయడం ‘జైలులో మత ప్రచారం, బలవంతపు మత మార్పిళ్లు...’ అన్న ప్రచారానికి బలం చేకూరుతోంది. మతం మారడానికి సిద్ధపడని వారిపై వేధింపులు ఎక్కువ కావడంతో జైలులో జరుగుతున్న విషయాలు ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి. జైలు పరిశీలనకు వస్తున్న అధికారులకు గానీ, జైలు గోడ పక్కనే ఉన్న కోస్తాంధ్ర జైళ్ల డీఐజీకి గానీ ఈ బలవంతపు మత మార్పిళ్లపై ఉప్పందకపోవడం విశేషమే.

ఈ వార్తలనూ చదవండి:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్

పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్

Updated Date - Nov 19 , 2026 | 01:27 AM