15 రోజుల్లో రైల్వేకు ‘జరిమానా’ ఆదాయం రూ.3.56 కోట్లు
ABN , Publish Date - Sep 25 , 2026 | 05:25 AM
దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో తనిఖీలు నిర్వహించి టికెట్లు లేని ప్రయాణికులు, లగేజీ బుకింగ్ చేయని వారి నుంచి అధికారులు రూ.3.56 కోట్ల జరిమానా వసూలుచేశారు. టికెట్లు తీసుకుని ప్రయాణం చేయాలని...
విశాఖపట్నం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో తనిఖీలు నిర్వహించి టికెట్లు లేని ప్రయాణికులు, లగేజీ బుకింగ్ చేయని వారి నుంచి అధికారులు రూ.3.56 కోట్ల జరిమానా వసూలుచేశారు. టికెట్లు తీసుకుని ప్రయాణం చేయాలని, సరైన టికెట్లతోనే రైళ్లు ఎక్కాలని ప్రచారం చేస్తూ ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో రైల్వే నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణిస్తున్న 46,156 మంది ప్రయాణికులకు జరిమానా విధించారు. తనిఖీలు నిర్వహించే అధికారులకు ప్రయాణికులు సహకరించాలని, రైళ్లను, స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.
ఈ వార్తలనూ చదవండి...
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే భయపడలేదు.. ఇప్పుడు భయపడతామా జగన్?!: మంత్రి లోకేశ్