‘సిగ్నల్’ వైర్లు కట్‌చేసి రైలు దోపిడీ
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:42 AM
రైల్వే సిగ్నల్ వ్యవస్థ వైర్లు కట్ చేసి రైలు దోపిడీకి పాల్పడ్డారు. అంతకుముందు ఓ గ్రామంలో చొరబడి ఐదిళ్లను దోచేశారు. రైల్వే పోలీసుల కథనం మేరకు..
ప్రయాణికురాలి మెడలో బంగారు చైను తస్కరణ
ముంగిలిపట్టులో ఐదిళ్లలోనూ చోరీ
తిరుపతి జిల్లాలో దొంగల స్వైరవిహారం
చంద్రగిరి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): రైల్వే సిగ్నల్ వ్యవస్థ వైర్లు కట్ చేసి రైలు దోపిడీకి పాల్పడ్డారు. అంతకుముందు ఓ గ్రామంలో చొరబడి ఐదిళ్లను దోచేశారు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, ముంగిలిపట్టు గ్రామంలో బుధవారం రాత్రి దొంగలు పడి.. రాజేశ్వరి అనే మహిళ ఇంట్లో రూ.45 వేల నగదు, 3గ్రాముల బంగారం దోచుకెళ్లారు. మిగిలిన ఇళ్లలో ఏమీ దొరకలేదు. దీంతో తెల్లవారుజామున ముంగిలిపట్టు రైల్వేస్టేషన్ వద్దకు చేరుకుని సిగ్నల్ వ్యవస్థ వైర్లు కట్ చేశారు.
దీంతో కన్యాకుమారికి వెళ్తున్న సింహసాగర్ ఎక్స్‌ప్రెస్ స్టేషన్ వద్ద ఆగిపోయింది. రైలెక్కిన దొంగలు తిరువనంతపురానికి చెందిన శోభ మెడలో 10గ్రాముల బంగారు చైన్ లాక్కున్నారు. రైలు దిగి.. పక్కనే ఉన్న మామిడి తోట ఫెన్సింగ్ కట్ చేసి, రోడ్డు మార్గంలో పరారయ్యారు. గురువారం ఉదయం చంద్రగిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మధ్యప్రదేశ్‌కు చెందిన తార్ గ్యాంగ్ సభ్యులే ఈ దోపిడీలకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు