కన్నులపండువగా సత్యసాయి రథోత్సవం
ABN , Publish Date - Nov 19 , 2026 | 05:36 AM
సత్యసాయి 101వ జయంతి ఉత్సవాలలో భాగంగా, శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి రథోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది
భక్తులతో నిండిపోయిన పుట్టపర్తి వీధులు
పుట్టపర్తి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): సత్యసాయి 101వ జయంతి ఉత్సవాలలో భాగంగా, శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి రథోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మండపంలో సత్యసాయి సత్యనారాయణ సామూహిక వ్రతం నిర్వహించారు. సత్యసాయి బంగారు విగ్రహానికి, సీతారాములు, వేణుగోపాల స్వామి పల్లకికి వేద పండితులు పూజలు నిర్వహించారు. వ్రతంలో 1100 జంటలు పాల్గొన్నాయి.
అనంతరం వేణుగోపాల స్వామి ఆలయం వద్ద సత్యసాయి వెండి రథాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అక్కడి నుంచి మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ప్రశాంతి నిలయం ఉత్తర గోపురం వద్దకు తీసుకువచ్చి సత్యసాయి బంగారు విగ్రహాన్ని వెండి రథంలో కొలువుదీర్చారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రథానికి పూజలు చేసి, రథోత్సవాన్ని ప్రారంభించారు. మూడుగంటల పాటు సాగిన రథోత్సవంలో సాయినామం మార్మోగింది. వేడుకల్లో పాల్గొన్న భక్తులకు ప్రశాంతి నిలయంలో నారాయణ సేవను అందించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్
పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్