పులివెందులలో 50 ఏళ్లుగా పీకలు కోసుకునే సంస్కృతి
ABN , Publish Date - Nov 01 , 2026 | 04:16 AM
పులివెందులలో 50 ఏళ్లుగా ఎన్నికల సమయంలో పీకలు కోసుకునే సంస్కృతి ఉందని డీఐజీ కోయ ప్రవీణ్ అన్నారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడానికి గట్టి చర్యలు తీసుకున్నామని..
ప్రశాంత పోలింగ్‌కు పటిష్ఠ చర్యలు: డీఐజీ
నేడు పులివెందుల వస్తున్న జగన్..
ఓటేసి ఇంటికి వెళ్లిపోవాలి.. పట్టణంలో తిరగకూడదు
పులివెందుల/కడప, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): పులివెందులలో 50 ఏళ్లుగా ఎన్నికల సమయంలో పీకలు కోసుకునే సంస్కృతి ఉందని డీఐజీ కోయ ప్రవీణ్ అన్నారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడానికి గట్టి చర్యలు తీసుకున్నామని.. 950మంది పోలీసు సిబ్బందిని మోహరించామని చెప్పారు. శనివారం పులివెందుల, కడపల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పులివెందులలోని 80 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగనుందని.. పట్టణాన్ని నాలుగు జోన్లుగా విభజించి సిబ్బందిని కేటాయించామని తెలిపారు. బయటిప్రాంతాల వారు రాకుండా అన్ని రహదారులపై తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు.
మాజీ సీఎం జగన్ ఆదివారం మధ్యాహ్నం పులివెందులకు రానున్నట్లు సమాచారం అందిందని.. ఆయన ఓటువేసిన వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని.. పులివెందులలో తిరగరాదని స్పష్టంచేశారు. అల్లర్లు, గొడవలకు పాల్పడినా.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదివారం మధ్యాహ్నం బెంగళూరు నుంచి పులివెందులలోని బాకరాపురానికి హెలికాప్టర్లో వస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడి నుంచి బాకరాపురంలో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఆయన, ఆయన సతీమణి భారతి ఓటు హక్కు వినియోగించుకుంటారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి బెంగళూరు వెళ్తారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..
జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!