Share News

కాకినాడ జిల్లాలో రూ.1.35 కోట్ల గంజాయి పట్టివేత

ABN , Publish Date - Oct 31 , 2026 | 04:39 AM

ఒడిశాలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రూ.1.35 కోట్ల విలువైన 270.175 కిలోల గంజాయిని శుక్రవారం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పోలీసులు పట్టుకున్నారు.

కాకినాడ జిల్లాలో రూ.1.35 కోట్ల గంజాయి పట్టివేత

  • ధర్మవరంలో ఇద్దరి అరెస్ట్‌.. పరారీలో ప్రధాన నిందితుడు

ప్రత్తిపాడు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ఒడిశాలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రూ.1.35 కోట్ల విలువైన 270.175 కిలోల గంజాయిని శుక్రవారం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పోలీసులు పట్టుకున్నారు. సీఐ బి.సూర్యఅప్పారావు ఈ కేసు వివరాలను విలేకరులకు వివరించారు. జిల్లాలోని ఈగల్‌ టీంకు వచ్చిన సమాచారంతో ప్రత్తిపాడు ఎస్‌ఐ ఎస్‌.లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో సిబ్బంది ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు.

తుని నుంచి రాజమహేంద్రవరంవైపు వస్తున్న ఓ కారులో తనిఖీలు చేపట్టగా అక్రమ గంజాయి రవాణా గుట్టురట్టయింది. ఈ ఘటనలో అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బెన్నభూపాలపట్నం గ్రామానికి చెందిన ఆదిరాజునాయుడు, పోతురాజు మణికంఠ అలియాస్‌ స్వామిలను అరెస్ట్‌ చేశారు. 270.175 కిలోల బరువైన ఎనిమిది బస్తాల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని సీఐ చెప్పారు. అరెస్టయిన ఇద్దరినీ ప్రత్తిపాడు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరచనున్నట్టు సీఐ చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 04:39 AM