1,468 గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా
ABN , Publish Date - Sep 25 , 2026 | 05:42 AM
తీవ్ర వాయుగుండంతో కురిసిన వర్షాలు, గాలులుకు ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని వివిధ జిల్లాల్లో 1,468 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 127 ప్రభావితం కాగా, 111 వరకూ 33 కేవీ ఫీడర్లకు నష్టం వాటిల్లింది.
1,468 గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా
విశాఖపట్నం, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): తీవ్ర వాయుగుండంతో కురిసిన వర్షాలు, గాలులుకు ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని వివిధ జిల్లాల్లో 1,468 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 127 ప్రభావితం కాగా, 111 వరకూ 33 కేవీ ఫీడర్లకు నష్టం వాటిల్లింది. 195 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు పాడైపోయాయి. మొత్తం 8,87,757 సర్వీసులకు సరఫరా నిలిచిపోయింది. ఈపీడీసీఎల్ అధికారులు రెండు రోజులు ముందుగానే సహాయక, పునరుద్ధరణ చర్యలకు ఏర్పాట్లు చేసుకోవడంతో గురువారం సాయంత్రం 5గంటలకు 8,30,679 సర్వీసులకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. సుమారు 745 మంది సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో పాల్గొన్నారు. ప్రాథమిక అంచనాల మేరకు రూ.2.51కోట్ల నష్టంవాటిల్లింది. సీఎండీ పృథ్వీతేజ్ ఆదేశాల మేరకు డైరెక్టర్ సూర్యప్రకాశ్, సీజీఎంలు సాల్మన్‌రాజు, మహేంద్రనాథ్, రాజబాబు, శ్యాంబాబు ప్రభావిత జిల్లాలకు వెళ్లి పనులు పర్యవేక్షిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి...