పోలింగ్ సిబ్బంది కష్టాలు
ABN , Publish Date - Nov 05 , 2026 | 05:17 AM
ఎన్నికల విధులంటే సిబ్బందికి కష్టాలే. విజయనగరం జిల్లా ఎస్.కోట మండలంలోని గిరిశిఖర గ్రామమైన పల్లపుదుంగాడ పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు సిబ్బంది బుధవారం నానా అవస్థలు పడ్డారు.
ఎన్నికల విధులంటే సిబ్బందికి కష్టాలే. విజయనగరం జిల్లా ఎస్.కోట మండలంలోని గిరిశిఖర గ్రామమైన పల్లపుదుంగాడ పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు సిబ్బంది బుధవారం నానా అవస్థలు పడ్డారు. ఎస్.కోట నుంచి దబ్బగుంట వరకు ఆటోలో వెళ్లారు. ఈ గ్రామానికి వెళ్లే రహదారి వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. దీంతో ఎన్నికల సామగ్రితో ఉన్న ఆటో పలుచోట్ల కొండ ఎక్కకపోవడంతో.. సిబ్బంది దాన్ని తోసుకుంటూ తీసుకెళ్లారు. నడుస్తూ.. ఆటోను తోసుకుంటూ.. నిట్టూరుస్తూ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు.
- ఎస్.కోట రూరల్, ఆంధ్రజ్యోతి
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్