Share News

600 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Sep 04 , 2026 | 04:54 AM

ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్‌ దగుడుపల్లి నుంచి 600 కిలోల గంజాయిని తుని తరలిస్తుండగా గురువారం ఉదయం అనకాపల్లి రూరల్‌ పోలీసులు సంపతిపురం జంక్షన్‌ వద్ద మాటువేసి వ్యాన్‌తో పాటు పైలట్‌ కారును పట్టుకున్నట్టు ఎస్పీ తుహిన్‌ సిన్హా తెలిపారు.

600 కిలోల గంజాయి స్వాధీనం

  • ముగ్గురి అరెస్టు... వ్యాన్‌, కారు సీజ్‌

అనకాపల్లి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్‌ దగుడుపల్లి నుంచి 600 కిలోల గంజాయిని తుని తరలిస్తుండగా గురువారం ఉదయం అనకాపల్లి రూరల్‌ పోలీసులు సంపతిపురం జంక్షన్‌ వద్ద మాటువేసి వ్యాన్‌తో పాటు పైలట్‌ కారును పట్టుకున్నట్టు ఎస్పీ తుహిన్‌ సిన్హా తెలిపారు. ఈ వ్యవహారంలో పశ్చిమగోదావరి జిల్లా ధర్మాజీగూడేనికి చెందిన మస్తాన్‌వలి, షేక్‌ మదీనా, అల్లూరి జిల్లాకు చెందిన పాంగి రత్నాలును అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఒడిశాకు చెందిన మూలం, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వాసి కోసం గాలింపు కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. 600 కిలోల గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన వ్యాన్‌, పైలట్‌గా ఉపయోగించిన కారును సీజ్‌ చేశామన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.3 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్టు ఎస్పీ తెలిపారు. షేక్‌ మస్తాన్‌ వలీ గతంలో అల్లూరి జిల్లా జి.మాడుగుల, కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు ఉన్నాయని తెలిపారు. పాంగి రత్నాలుపై జి.మాడుగుల పీఎస్‌ పరిధిలో ఒక కేసు నమోదైందన్నారు. చాకచక్యంగా వ్యవహరించి గంజాయి నిల్వలను, ముఠాను పట్టుకున్న సిబ్బందిని అభినందించిన ఎస్పీ నగదు రివార్డులు అందజేశారు.

Updated Date - Sep 04 , 2026 | 04:54 AM