Share News

మావోయిస్టుల భారీ డంప్‌ స్వాధీనం

ABN , Publish Date - Nov 19 , 2026 | 01:39 AM

ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో బుధవారం ప్రత్యేక బృందం, సీఆర్‌ఫీఎఫ్‌ బలగాలు నిర్వహించిన అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను...

మావోయిస్టుల భారీ డంప్‌ స్వాధీనం

ఎటపాక, నవంబరు 18(అంధ్రజ్యోతి): ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో బుధవారం ప్రత్యేక బృందం, సీఆర్‌ఫీఎఫ్‌ బలగాలు నిర్వహించిన అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలవరం జిల్లా ఎస్పీ చక్రవర్తి వెల్లడించారు. పోలవరం జిల్లా ఎటపాక పోలీసుస్టేషన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

గత ఏడాదిలో జరిగిన ఆపరేషన్‌ హిడ్మాకు చెందిన ఈవోఎఫ్‌ని నిర్వీర్యం చేశామని, దానికి కొనసాగింపుగా చేపట్టిన గాలింపులో మావోయిస్టులకు చెందిన డంప్‌ను గుర్తించామన్నారు. కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్‌ 212 బెటాలియం కొంటా రేంజ్‌, ఛత్తీస్‌గఢ్ సెక్టార్‌ సెంకడ్‌ ఇన్‌ కమాండ్‌ దినేశ్‌కుమార్‌, సీఆర్‌పీఎఫ్‌ కోబ్రా 204, 196 బెటాలియన్లకు చెందిన దీపక్‌ కుమార్‌ గుర్వే, అభిషేక్‌ మిశ్రా, జిల్లా ఓఎస్డీ జావళి ఆల్పోన్స్‌, చింతూరు డీఎస్పీ ఉదయపావని పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్

పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్

Updated Date - Nov 19 , 2026 | 01:39 AM