తుఫాన్‌తో పోలవరానికి నష్టం లేకుండా చూడాలి
ABN , Publish Date - Nov 18 , 2026 | 04:35 AM
పోలవరం ప్రాజెక్టులో నాణ్యతా పరీక్షల రికార్డులు ఎప్పటికప్పుడు భద్రపరచాలని, తుఫాన్ వల్ల ప్రాజెక్టు పనుల్లో నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రాజెక్టు సీఈవో సంజీవ్ వోహ్రా ఆదేశించారు.
కాఫర్ డ్యాంల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రాజెక్టు సీఈవో సంజీవ్ వోహ్రా ఆదేశం
పోలవరం, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో నాణ్యతా పరీక్షల రికార్డులు ఎప్పటికప్పుడు భద్రపరచాలని, తుఫాన్ వల్ల ప్రాజెక్టు పనుల్లో నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రాజెక్టు సీఈవో సంజీవ్ వోహ్రా ఆదేశించారు. మంగళవారం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆయన పీపీఏ సభ్య కార్యదర్శి ఎం.రఘురామ్, సీఈ రమేష్ కుమార్‌లతో కలిసి పనుల వివరాలను జలవనరులశాఖ అధికారులు, మేఘా నిర్మాణ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
అధికారు లు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పనుల ప్రగతిని వివరించారు. గత పర్యటనల్లో చేసిన సూచనలు, ఇటీవల విదేశీ నిపుణుల బృందం పర్యటనలో ఇచ్చిన సలహాల అమలు తీరును పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
వరుస తుఫాన్లతో కాఫర్ డ్యాంల నడుమ నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్మాణ సంస్థకు, అధికారులకు వోహ్రా సూచించారు. అనంతరం ఈసీఆర్‌ఎఫ్ డ్యాం నిర్మాణంలో గ్యాప్ 1, గ్యాప్ 2, జి హిల్, జి డ్యాష్ హిల్ ప్రాంతాల్లో నిర్మాణ పనుల్ని పరిశీలించి నాణ్యతా ప్రమాణాల పరీక్షలు నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అనుకున్న లక్ష్యానికంటే ముందే పూర్తి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబద్ధతతో ఉన్నాయని వోహ్రా తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు