ఎన్నికలు బహిష్కరించిన ‘పోలవరం నిర్వాసితులు’
ABN , Publish Date - Nov 27 , 2026 | 06:17 AM
ఏలూరు జిల్లా పోలవరం నిర్వాసిత కొరుటూరు గ్రామ గిరిజనులు సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించారు. ఈ గ్రామానికి చెందిన 773 మంది ఓటేసేందుకు రాలేదు.
ఏలూరు జిల్లా పోలవరం నిర్వాసిత కొరుటూరు గ్రామ గిరిజనులు సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించారు. ఈ గ్రామానికి చెందిన 773 మంది ఓటేసేందుకు రాలేదు. ఈ పంచాయతీలో గాజులగొంది, వాడపల్లి, కొరుటూరు, చీడూరు, శిరివాక, టేకూరు గ్రామాలు ఉన్నాయి. వీరంతా తమ పంచాయతీని గిరిజనేతర గ్రామమైన పి.అంకంపాలెంలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎంపీటీసీ ఎన్నికలను కూడా కొరుటూరు గ్రామాల ప్రజలు బహిష్కరించారు. అలాగే ప్రత్యేక పంచాయతీని కోరుతూ బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం పంచాయతీలోని తూటుకుంట, పల్లపూరు, పైడాకులమామిడి, తెల్లవరం, ములకలగూడెం గ్రామాల నిర్వాసితులు కూడా పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు.
- జీలుగుమిల్లి/బుట్టాయగూడెం, ఆంధ్రజ్యోతి
ఈ వార్తలనూ చదవండి:
2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు
బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా