Share News

సామాజిక మాధ్యమాల్లో పవన్‌పై అసభ్యకర పోస్టులు

ABN , Publish Date - Nov 12 , 2026 | 02:00 AM

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న గుంటూరు జిల్లా వాసిని పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. ‘

సామాజిక మాధ్యమాల్లో పవన్‌పై అసభ్యకర పోస్టులు

  • గుంటూరు జిల్లా వాసి అరెస్టు

పిఠాపురం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న గుంటూరు జిల్లా వాసిని పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. ‘ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నాడు. విద్వేషాలు రెచ్చగొట్టేలా, అవమానకరంగా వాఖ్యలు, వ్యంగ్యపూరిత కాప్షన్లతో ప్రచారం చేస్తున్నాడు’ అంటూ జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. గత నెల 13న కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన కూరపాటి రవీంద్రబాబు అలియాస్‌ రవీంద్రను బాధ్యుడిగా గుర్తించారు. బుధవారం పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద రవీంద్రబాబును అదుపులోకి తీసుకుని అతని సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసు దర్యాప్తు చేయడమే గాక నిందితుడిని అరెస్టు చేసిన సీఐ సత్యనారాయణ బృందాన్ని ఎస్పీ బిందుమాధవ్‌ అభినందించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు

15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు

Updated Date - Nov 12 , 2026 | 02:02 AM