శ్రీశైలం భక్తులకు దోర్నాలలో వసతులు కల్పించాలి
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:40 AM
శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే భక్తులకు దోర్నాల చెక్ పోస్టు వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.
హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు
అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే భక్తులకు దోర్నాల చెక్ పోస్టు వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, శ్రీశైలం దేవస్థానం బోర్డు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. విచారణను వాయిదా వేసింది.
ఈ వార్తలనూ చదవండి...
ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’