మహిళలకు జగన్ క్షమాపణ చెప్పాలి: సుజాత
ABN , Publish Date - Nov 18 , 2026 | 01:14 AM
సొంత చెల్లిని కూడా అవమానించే జగన్ రాజకీయాలకు అనర్హుడు’ అని ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్‌పర్సన్ పీతల సుజాత అన్నారు.
అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ‘రాజకీయ విమర్శలకు ఒక హద్దు, మీడియా స్వేచ్ఛకు ఒక సామాజిక బాధ్యత ఉంటుంది. సొంత చెల్లిని కూడా అవమానించే జగన్ రాజకీయాలకు అనర్హుడు’ అని ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్‌పర్సన్ పీతల సుజాత అన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘కనీస విలువలు లేకుండా కుటుంబ వ్యవహారాలను కూడా రాజకీయ కక్ష కోణంలో చూస్తూ జుగుప్సాకరమైన రాతలు రాయించడం ఒక్క జగన్‌కే చెల్లుతుంది.
తండ్రి వయసున్న వ్యక్తిని కలిసి కూతురి పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించడంలో తప్పేముంది? దానిని కూడా దుర్మార్గంగా వక్రీకరించి, అసభ్యకరమైన పదజాలంతో రాయించే స్థాయికి జగన్ దిగజారడం దురదృష్టకరం. మహిళా లోకాన్ని అవమానించేలా జగన్ మీడియా రాతలున్నాయి. దీనికి బాధ్యత తీసుకుని జగన్ తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలి’ అని సుజాత డిమాండ్ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు