సమగ్ర ‘స్థానిక’ సమాచారమివ్వండి
ABN , Publish Date - Sep 26 , 2026 | 05:48 AM
స్థానిక ఎన్నికలకు సంబంధించి క్షేత్ర స్థాయి నుంచి కమిటీల ద్వారా సేకరించిన సమగ్ర సమాచారాన్ని నివేదికల రూపంలో సిద్ధం చేసి తన అందించాలని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.
జనసేన సమన్వయ కమిటీకి పవన్ కల్యాణ్ ఆదేశం
అమరావతి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలకు సంబంధించి క్షేత్ర స్థాయి నుంచి కమిటీల ద్వారా సేకరించిన సమగ్ర సమాచారాన్ని నివేదికల రూపంలో సిద్ధం చేసి తన అందించాలని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కేంద్ర కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. సమన్వయంతో ముందుకు సాగాలని, ఎప్పటికప్పుడు జనసేన శ్రేణుల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి, తనకు నివేదించాలని చెప్పారు. కమిటీ సోమవారం మరోసారి సమావేశమై.. పూర్తిస్థాయిలో కార్యాచరణకు సన్నద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, చిల్లపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పులవర్తి ప్రశాంత్, రైల్వేకోడూరుకు చెందిన యనమల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి..
ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ