సీఎం చంద్రబాబు పుట్టిన రోజు.. శుభాకాంక్షలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్
ABN , Publish Date - Apr 20 , 2026 | 09:08 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు.
అమరావతి, ఏప్రిల్ 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మంచి ప్రభుత్వం అనే నినాదాన్ని నిజం చేసేలా సాగుతున్న సీఎం చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలుస్తుందని అన్నారు. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ..
‘ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు నాయుడు తన విజన్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బృహత్తర బాధ్యతను తీసుకున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అనే లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు చిరునామాగా తీర్చిదిద్దటం ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపరుస్తున్నారు. సీఎం చంద్రబాబుకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, సంతోషాన్ని అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
యూఎస్‌తో చర్చలకు నో.. ఇరాన్ సంచలన నిర్ణయం!