Share News

గవర్నర్‌కు అనారోగ్యం.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఉప ముఖ్యమంత్రి పవన్

ABN , Publish Date - Apr 25 , 2026 | 06:24 PM

గవర్నర్ అబ్దుల్ నజీర్ అనారోగ్యంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయన త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తన రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించాలని ఆకాంక్షించారు.

గవర్నర్‌కు అనారోగ్యం.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఉప ముఖ్యమంత్రి పవన్
Pawan Kalyan Abdul Nazeer,

అమరావతి, ఏప్రిల్ 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం ఉదయం అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. కడుపునొప్పితో ఆయన తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించాలని సూచించారు. ముఖ్యమైన కార్యక్రమాల కారణంగా ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.


గవర్నర్ అబ్దుల్ నజీర్ అనారోగ్యంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ‘ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారని తెలుసుకుని ఆందోళన చెందాను. ఆయన త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తన రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించాలని ప్రార్థిస్తున్నాను’ అని అన్నారు.


గవర్నర్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. లోక్‌ భవన్‌కు చేరుకున్న సీఎం.. గవర్నర్‌ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


ఇవి కూడా చదవండి

జగనన్న లే అవుట్‌లలో భారీగా అవినీతికి పాల్పడ్డారు: మంత్రి కొల్లు రవీంద్ర

బీజేపీ వస్తే రాత్రి ఒంటిగంటకైనా మహిళలు బయట తిరగొచ్చు.. మమతపై అమిత్ షా విమర్శలు..

Updated Date - Apr 25 , 2026 | 06:53 PM