పాత కమిటీలను రద్దు చేసిన అధినేత పవన్
ABN , Publish Date - Oct 01 , 2026 | 04:58 AM
స్థానిక ఎన్నికల కోసం పార్టీ తరఫున పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమన్వయం, పర్యవేక్షణకు నూతన కమిటీలను నియమించాలని పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈమేరకు జనసేన పార్టీ కార్యాలయం బుధవారం ప్రకటన జారీ చేసింది.
అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల కోసం పార్టీ తరఫున పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమన్వయం, పర్యవేక్షణకు నూతన కమిటీలను నియమించాలని పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈమేరకు జనసేన పార్టీ కార్యాలయం బుధవారం ప్రకటన జారీ చేసింది. ‘గతంలో నియమించిన సమన్వయకర్తలు, ముగ్గురు సభ్యులతో కూడిన సమన్వయ కమిటీలు, వారికి అనుబంధంగా ఉన్న సపోర్ట్ టీమ్స్ చెల్లుబాటులో ఉండవు. 25 మంది సభ్యులతో కూడిన పార్లమెంటు కమిటీలను రద్దు చేశాం. ఇటీవల రాష్ట్రస్థాయిలో స్థానిక ఎన్నికల కోసం నియమించిన ఐదుగురు సభ్యులతో కూడిన సమన్వయ కమిటీ, ప్రచార కమిటీలు యథావిధిగా విధులు నిర్వహిస్తాయి. కొత్త కమిటీలను త్వరలోనే పవన్ కల్యాణ్ నియమిస్తారు’ అని కార్యాలయం పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి...
ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’