Share News

కాలువలో కూలిన సచివాలయ భవనం

ABN , Publish Date - Nov 24 , 2026 | 01:02 AM

పట్టిసీమ పుష్కరఘాట్‌లో కొవ్వాడ కాలువ స్పిల్‌వే ఎడమ గట్టుకు ఆనుకుని ఉన్న ఫెర్రీ రేవు సచివాలయ భవనం సోమవారం మధ్యాహ్నం స్పిల్‌వేలోకి కూలిపోయింది.

కాలువలో కూలిన సచివాలయ భవనం

  • పట్టిసీమ పుష్కరఘాట్‌లో కొవ్వాడ కాలువ స్పిల్‌వే

  • ‘ఆంధ్రజ్యోతి’.. ముందే హెచ్చరించినా పట్టని అధికారులు

పోలవరం, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): పట్టిసీమ పుష్కరఘాట్‌లో కొవ్వాడ కాలువ స్పిల్‌వే ఎడమ గట్టుకు ఆనుకుని ఉన్న ఫెర్రీ రేవు సచివాలయ భవనం సోమవారం మధ్యాహ్నం స్పిల్‌వేలోకి కూలిపోయింది. ఐదేళ్లుగా గోదావరి వరదలతో పాటు ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ కొవ్వాడ కాలువ అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌ నుంచి ఉధృతంగా ప్రవహించిన కొండవాగుల జలాల తాకిడికి క్రమక్రమంగా భవనం అడుగుభాగం వరకు గట్టు కోతకు గురవుతూ వచ్చింది. ఏటా మహాశివరాత్రి ఉత్సవాల సమీక్షా సమావేశాల్లో గట్టు పునరుద్ధరించాలని కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు జంగారెడ్డిగూడెం ఆర్డీవో చర్చలు జరిపారే తప్ప ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.

దీనిపై ఐదేళ్లుగా ‘ఆంధ్రజ్యోతి’లో పలుమార్లు కథనాలు వచ్చినా అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. ఇటీవల వరుస తుఫానుల నేపథ్యంలో ‘ప్రమాదం అంచున’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో మరోసారి కథనం వచ్చింది. అయినా అధికారులు స్పందించలేదు. భవనం కాలువలోకి కూలిపోవడంతో సచివాలయ సామగ్రి, రికార్డుల బీరువాలు, పారిశుధ్యానికి వినియోగించే డస్ట్‌బిన్లు సహా కాలువలోకి పడిపోయాయి.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 01:24 AM