Share News

జడ్పీ పీఠంపై పరిటాల వారసుడు

ABN , Publish Date - Nov 21 , 2026 | 02:43 AM

శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటయ్యాక తొలి జడ్పీ చైర్మన్‌గా మాజీ మంత్రి పరిటాల రవీంద్ర, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతల తనయుడు పరిటాల శ్రీరామ్‌ ఎన్నికయ్యారు.

జడ్పీ పీఠంపై పరిటాల వారసుడు

పుట్టపర్తి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటయ్యాక తొలి జడ్పీ చైర్మన్‌గా మాజీ మంత్రి పరిటాల రవీంద్ర, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతల తనయుడు పరిటాల శ్రీరామ్‌ ఎన్నికయ్యారు. నల్లచెరువు నుంచి జడ్పీటీసీగా ఎన్నికైన ఈయన శుక్రవారం పదవీప్రమాణం చేశారు. అనంతరం శ్రీరామ్‌ తన తల్లికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.

కుమారుడిని ఆమె ఆత్మీయంగా ముద్దాడారు. కుమారుడి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆమె తన మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యేలు ఎంఎ‌స్ రాజు, పల్లె సింధూరారెడ్డి, కందికుంట వెంకట ప్రసాద్‌, కూటమి పార్టీల నేతలు హాజరయ్యారు.

ఈ వార్తలనూ చదవండి:

పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి

తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి

Updated Date - Nov 21 , 2026 | 02:47 AM