Share News

పోటాపోటీగా రోడ్ల నిర్మాణం

ABN , Publish Date - Nov 27 , 2026 | 06:22 AM

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

పోటాపోటీగా రోడ్ల నిర్మాణం

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రులో తమ రోడ్లు బాగోలేవని కాలనీవాసులు అభ్యర్థులకు చెప్పారు. దీంతో అభ్యర్థులిద్దరూ లారీలతో కంకరు తెప్పించి, కాలనీల్లో రోడ్లు వేయిస్తున్నారు. జేసీబీతో పని చేయించటంతోపాటు నాయకులు కూడా స్వయంగా పారలు చేతబట్టి రోడ్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- పెరవలి, ఆంధ్రజ్యోతి

ఈ వార్తలనూ చదవండి:

2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు

బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా

Updated Date - Nov 27 , 2026 | 06:23 AM