తిరుపతి నుంచి వారాణసీకి బైక్ యాత్ర
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:25 AM
ప్రజా జీవితంలో నిబద్ధత కలిగిన నాయకత్వం ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబుల రూపంలో దేశానికి లభించిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
సేవా సంకల్ప యాత్రను ప్రారంభించిన పల్లా
తిరుపతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రజా జీవితంలో నిబద్ధత కలిగిన నాయకత్వం ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబుల రూపంలో దేశానికి లభించిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాతికేళ్ల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాలతో టీఎన్‌ఎస్ఎఫ్ బుధవారం తిరుపతి నుంచి సేవా సంకల్ప యాత్రను ప్రారంభించింది.
అందులో భాగంగా అలిపిరి నుంచి వారాణసీ వరకూ 25 మంది బైక్ రైడర్లు బైక్ యాత్ర చేపట్టారు. యాత్రను ప్రారంభించిన పల్లా మాట్లాడారు. ‘ఈ యాత్ర ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా అక్టోబరు 8న వారాణసీ చేరుకుంటుంది’ అని చెప్పారు. పనబాక లక్ష్మి, ఎమ్మెల్యేలు అరణి శ్రీనివాసులు, నెలవల విజయశ్రీ, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ, టీఎన్‌ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి...
ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’