Share News

40కి పైగా విమాన సర్వీసులు రద్దు

ABN , Publish Date - Oct 29 , 2026 | 06:11 AM

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం 40కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. తుఫాన్‌ కారణంగా దట్టమైన మేఘాలు ఆవరించి, విమానాల టేకాఫ్‌, ల్యాండింగ్‌కు ఇబ్బందికరంగా ఉండటంతో సర్వీసులన్నింటినీ రద్దు చేశారు.

40కి పైగా విమాన సర్వీసులు రద్దు

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం 40కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. తుఫాన్‌ కారణంగా దట్టమైన మేఘాలు ఆవరించి, విమానాల టేకాఫ్‌, ల్యాండింగ్‌కు ఇబ్బందికరంగా ఉండటంతో సర్వీసులన్నింటినీ రద్దు చేశారు. దీంతో రెండోరోజు కూడా ఇక్కడి నుంచి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడ, తిరుపతికి ఇండిగో, ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులతో పాటు సింగపూర్‌ స్కూట్‌ ఎయిర్‌లైన్స్‌, అబుదాబీ విమానాలు నిలిచిపోయాయి. గురువారం వాతావరణ పరిస్థితిని బట్టి సర్వీసులు నడిపే విషయమై నిర్ణయం తీసుకుంటారని ఏపీ ఎయిర్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి తెలిపారు.

నేడు పలు రైళ్లు రద్దు.. తుఫాన్‌ ప్రభావంతో గురువారం భువనేశ్వర్‌- సికింద్రాబాద్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17015), హౌరా- సికింద్రాబాద్‌ ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌ (12703), విశాఖ- పార్వతీపురం ప్రత్యేక రైలు (07268), విశాఖ- రాజమండ్రి మెము (67286) రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

ఈ వార్తలనూ చదవండి:

పోటాపోటీ

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 29 , 2026 | 06:11 AM