Share News

సీఎస్‌సీ కేంద్రంపై పోలీసుల దాడులు

ABN , Publish Date - Nov 22 , 2026 | 01:39 AM

పంచాయతీ ఎన్నికలలో దొంగఓట్లు వేసేందుకు నకిలీ ఆధార్‌ కార్డులను సృష్టిస్తున్నారన్న అనుమానంతో అనంతపురం జిల్లా కేంద్రంలోని ...

సీఎస్‌సీ కేంద్రంపై పోలీసుల దాడులు

  • అనంతలో భారీగా నకిలీ ఆధార్‌లు స్వాధీనం

  • దొంగ ఓట్లు వేయించేందుకు వైసీపీ నాయకుడి కుట్ర..?

అనంతపురం క్రైం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలలో దొంగఓట్లు వేసేందుకు నకిలీ ఆధార్‌ కార్డులను సృష్టిస్తున్నారన్న అనుమానంతో అనంతపురం జిల్లా కేంద్రంలోని కామన్‌ సర్వీస్‌ సెంటర్లో పోలీసులు శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ప్రసన్నాయపల్లి పంచాయతీ పరిధిలోని చిన్మయ నగర్‌లో పరంధామ రెడ్డి అనే ఓ వ్యక్తి నకిలీ ఆధార్‌ కార్డులు తయారు చేస్తున్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో రాప్తాడు పోలీసులు సీఎస్‌సీ కేంద్రంపై దాడులు నిర్వహించారు. ఈ కేంద్రంలో రెండు వేలకు పైగా నకిలీ ఆధార్‌ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

ప్రసన్నాయపల్లి సర్పంచ్‌ ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీ మద్దతుదారుడు ఈ నకిలీ రాకెట్‌ వెనుక ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు తనిఖీలకు వచ్చిన సమయంలో కామన్‌ సర్వీస్‌ సెంటర్లో ఉన్న పరంధామరెడ్డి, సదరు సర్పంచ్‌ అభ్యర్థికి ఫోన్‌ చేశారని, పోలీసులు వచ్చారని ఆయనకు చెబుతూ, కాల్‌ కట్‌ చేశారని సమాచారం. కాగా, నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు అంటున్నారు. చనిపోయిన, వలస ఓటర్ల జాబితా ఆధారంగా నకిలీ ఆధార్‌ కార్డులను తయారు చేస్తున్నట్లు సమాచారం. వారిపేరిట పంచాయతీ ఎన్నికల్లో దొంగఓట్లు వేయించి గెలవాలని కుట్రకు తెరలేపినట్లు సమాచారం.

ఈ వార్తలనూ చదవండి:

బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?

కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి

Updated Date - Nov 22 , 2026 | 01:39 AM