కారు దగ్ధం.. వ్యక్తి సజీవ దహనం
ABN , Publish Date - Nov 15 , 2026 | 04:39 AM
సింగరాయకొండ-పోరుమామిళ్ల జాతీయ రహదారి 167బీపై మార్కాపురం జిల్లా పామూరు మండలం లింగన్నపాలెం జంక్షన్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి పెనుప్రమాదం జరిగింది.
పామూరు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): సింగరాయకొండ-పోరుమామిళ్ల జాతీయ రహదారి 167బీపై మార్కాపురం జిల్లా పామూరు మండలం లింగన్నపాలెం జంక్షన్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి పెనుప్రమాదం జరిగింది. మంటల్లో దగ్ధమైన కారులో ఉన్న వ్యక్తి సజీవదహనమయ్యాడు. సమాచారం అందుకున్న కనిగిరి డీఎస్పీ శ్రీనివాసరావు, పామూరు సీఐ వినోద్‌కుమార్, ఎస్‌ఐ కె.అనూక్ కారు దగ్ధమైన ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి వివరాల కోసం టోల్‌ప్లాజా వద్ద సీసీ పుటేజ్ సేకరణ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం