Share News

నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు 250.62 కోట్లు విడుదల

ABN , Publish Date - Oct 01 , 2026 | 04:12 AM

ఎన్టీఆర్‌ వైద్య సేవ, ఉద్యోగుల ఆరోగ్య పథకం బిల్లులను ప్రభుత్వం విడుదల చేసింది. బుధవారం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రూ.250.62 కోట్లు చెల్లించింది. వైద్య సేవ కింద క్లైయిమ్‌ బిల్లులు, బీడీఎస్‌ (బిల్‌ డిస్కౌంట్‌ సిస్టమ్‌) కింద రూ.227.69 కోట్లు...

నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు 250.62 కోట్లు విడుదల

  • ఎన్టీఆర్‌ వైద్యసేవకు 227.69 కోట్లు..

  • ఈహెచ్‌ఎస్‌కు 22.93 కోట్లు

అమరావతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ వైద్య సేవ, ఉద్యోగుల ఆరోగ్య పథకం బిల్లులను ప్రభుత్వం విడుదల చేసింది. బుధవారం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రూ.250.62 కోట్లు చెల్లించింది. వైద్య సేవ కింద క్లైయిమ్‌ బిల్లులు, బీడీఎస్‌ (బిల్‌ డిస్కౌంట్‌ సిస్టమ్‌) కింద రూ.227.69 కోట్లు, ఈహెచ్‌ఎస్‌ క్లైయిములకు సంబంధించిన బిల్లులు రూ.22.93 కోట్లు విడుదల చేసింది. 2026-27లో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ ఈహెచ్‌ఎస్‌ పథకం కింద బిల్లుల రూపంలో రూ.2,025 కోట్లు విడుదల చేసినట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ వివరించారు. అందులో ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రూ.1,823.30 కోట్లు, మిగిలింది ప్రభుత్వ ఆస్పత్రులకు జమ చేసినట్లు వివరించారు.

ఈ వార్తలనూ చదవండి...

ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’

రైతులకు తీపి కబురు

Updated Date - Oct 01 , 2026 | 04:12 AM