Share News

విదేశాల్లో ఉపాధి.. సొంతూరిపై మమకారం!విదేశాల్లో ఉపాధి.. సొంతూరిపై మమకారం!

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:38 AM

ఉపాధి కోసం విదేశాల్లో ఉంటున్నా.. సొంతూరిపై మమకారం మాత్రం తగ్గలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పలువురు ప్రవాసాంధ్రులు స్వగ్రామాలకు చేరుకున్నారు.

విదేశాల్లో ఉపాధి.. సొంతూరిపై మమకారం!విదేశాల్లో ఉపాధి.. సొంతూరిపై మమకారం!

  • ‘స్థానిక’ ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చిన ప్రవాసాంధ్రులు

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి: ఉపాధి కోసం విదేశాల్లో ఉంటున్నా.. సొంతూరిపై మమకారం మాత్రం తగ్గలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పలువురు ప్రవాసాంధ్రులు స్వగ్రామాలకు చేరుకున్నారు. గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సౌదీ అరేబియాలో పనిచేస్తున్న కృష్ణా జిల్లా ఈడుపుగల్లుకు చెందిన రాజశేఖర్‌ చెన్నుపాటి గురువారం స్వగ్రామంలో ఓటు వేశారు. గ్రామ ఎన్నికల్లో ఓటు వేయడం ప్రత్యేక అనుభూతినిచ్చిందని తెలిపారు. ఒమాన్‌లో పనిచేస్తున్న చిత్తూరు జిల్లా ఐరాల మండలం భీమనేనివారిపల్లికి చెందిన వడ్లపట్ల మురళి మరో ముగ్గురు ప్రవాసాంధ్రులతో కలిసి స్వగ్రామానికి వచ్చి ఓటు వేశారు.

మరోవైపు, ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్వదేశానికి చేరుకున్నప్పటికి, తుఫాను కారణంగా బెంగుళూరు నుంచి మార్కాపురంలోని తమ ఊరికు వెళ్లలేకపోయానని సౌదీ అరేబియాలో ఉంటున్న శిల్పా గడ్డం ఆవేదన వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లాలోని గాలివీడు, సంబేపల్లి, పుల్లంపేట మండలాల్లోనూ గల్ఫ్‌ ప్రవాసులు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. కువైత్‌లో ఉద్యోగాలకు సెలవు పెట్టి గొర్లముదివీడు గణేశ్‌, ఖాద్రూన్‌ షేక్‌ గాలివీడులో మకాం వేశారు. ఖతార్‌ నుంచి ఒంగోలు కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తన భార్య, కుమార్తె వచ్చారని టీడీపీ నాయకుడు గొట్టిపాటి రమణ తెలిపారు. విదేశాల్లో ఉన్నప్పటికీ కూటమి అభ్యర్థులకు అన్ని విధాలా మద్దతు ఇచ్చామని సౌదీలోని జనసేన నాయకులు దుగ్గరపు ఎర్రన్న, యాకూబ్‌ పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటెత్తిన పల్లెలు

అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ

Updated Date - Nov 06 , 2026 | 05:40 AM