Share News

ఎక్కడ ఎంత వర్షం..?

ABN , Publish Date - Sep 25 , 2026 | 05:40 AM

తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత గురువారం ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్తరకోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మన్యం, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిశాయి. దక్షిణకోస్తాలో మోస్తరు నుంచి భారీగా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి.

ఎక్కడ ఎంత వర్షం..?

తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత గురువారం ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్తరకోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మన్యం, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిశాయి. దక్షిణకోస్తాలో మోస్తరు నుంచి భారీగా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. కోస్తాంధ్రలో ముసురుపట్టినట్లు చాలా ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వాన జల్లులు పడుతున్నాయి. మన్యం జిల్లా చిలకలపల్లెలో అత్యధికంగా 10.82, రాజమండ్రిలో 10.6, గాడాలలో 10.25, మన్యం జిల్లా మక్కువలో 10.1, తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడిలో 9.27, అల్లూరి జిల్లా చింతపల్లిలో 8.84, మన్యం జిల్లా పార్వతీపురంలో 8.72, తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో 8.07, కాకినాడ అర్బన్‌లో 7.85, రూరల్‌లో 7.6, తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో 7.57, కాకినాడ జిల్లా జగ్గంపేటలో 7.15, పెద్దాపురంలో 7.1, విజయనగరం జిల్లా బొబ్బిలిలో 7 సెంటీమీటర్ల వాన పడింది. కోస్తా జిల్లాల్లోని 270 ప్రాంతాల్లో 2 సెంటీమీటర్లకుపైగా వాన కురిసింది.

ఈ వార్తలనూ చదవండి...

మహిళల భద్రతకు ప్రాధాన్యం

బజార్‌లో పోస్టుల అమ్మకం

Updated Date - Sep 25 , 2026 | 05:40 AM