Share News

ఇచ్చిన హామీలు మరిచిన చరిత్ర నీది.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం

ABN , Publish Date - May 27 , 2026 | 07:14 PM

ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ జగన్ పూర్తిగా ఎగనామం పెట్టారని విమర్శించారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.

ఇచ్చిన హామీలు మరిచిన చరిత్ర నీది.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం
Nimmala Rama Naidu fire on YS Jagan

అమరావతి, మే 27: ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ జగన్ పూర్తిగా పక్కన పెట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలనా దక్షతతో అటు సంక్షేమానికి, ఇటు అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం వల్ల వెంటిలేటర్ మీదకు వెళ్లిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 24 నెలల కాలంలోనే చంద్రబాబు మళ్లీ గాడిలో పెట్టారని కొనియాడారు.


మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. ‘వైసీపీ ఐదేళ్ల పాలనలో పోలవరం ఎడమ కాలువ పనుల్లో కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఇచ్చిన మాట ప్రకారం హంద్రీనీవాకు నీళ్లు ఇచ్చాం. అంతేకాకుండా, రూ. 1,500 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఏడాది మొదటి దశలోనే అనకాపల్లి వరకూ గోదావరి జలాలు తీసుకెళ్లేలా పనులు శరవేగంగా పూర్తి చేశాం. వెన్నుపోటు, గొడ్డలిపోటు రాజకీయాల గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. దళితులకు సంబంధించిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి, వారిని దారుణంగా వంచించిన విషయం అందరికీ తెలుసు. గొడ్డలిపోటుకు, వెన్నుపోటుకు నిజమైన పేటెంట్ హక్కు జగన్‌కే దక్కుతుంది. నాడు లోకేష్ చేపట్టిన 'యువగళం' పాదయాత్రలో అడుగడుగునా జగన్ అడ్డుపడ్డారని, అక్రమ కేసులు పెట్టి కూటమి నాయకులను, కార్యకర్తలను తీవ్రంగా వేధించిన కుఠిల రాజకీయం నీది. ప్రజలు కేవలం 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా జగన్ మారలేదని, ప్రజలపై పగ పట్టినట్లు వ్యవహరిస్తున్నారు’ అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో భారీగా ఎమ్మార్వోలు బదిలీ

నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. మహానాడులో సీఎం చంద్రబాబు పంచ్ డైలాగ్స్

For More AP News

Updated Date - May 27 , 2026 | 08:40 PM