Share News

అర్హులైన ప్రతి నేతన్నకూ అండగా ఉంటాం: మంత్రి సవిత

ABN , Publish Date - Aug 14 , 2026 | 12:04 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'నేతన్నల సేవలో' పథకంపై చేనేత, జవుళి శాఖ మంత్రి సవిత కీలక ప్రకటన చేశారు..

అర్హులైన ప్రతి నేతన్నకూ అండగా ఉంటాం: మంత్రి సవిత
AP Weavers Scheme

అమరావతి, ఆగస్టు 14: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన 'నేతన్నల సేవలో' పథకంపై చేనేత, జవుళి శాఖ మంత్రి సవిత కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి నేతన్నకూ ఈ పథకం కింద రూ.25,000 ఆర్థిక సాయాన్ని ఖచ్చితంగా అందజేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే మెజారిటీ అర్హులైన నేతన్నల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఈ మొత్తాన్ని జమ చేశామని తెలిపారు. ఇతర కారణాల వల్ల సాయం అందని మిగిలిన లబ్ధిదారులకు కూడా రాబోయే ఒకట్రెండు రోజుల్లోనే నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. నేతన్నల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.


ఎవరూ ఆందోళన చెందవద్దు..

ఇటీవల కొత్తగా వచ్చిన దరఖాస్తులను అధికారులు వేగంగా పరిశీలిస్తున్నారని, క్షేత్రస్థాయి విచారణ పూర్తయిన వెంటనే కొత్త దరఖాస్తుదారులకు కూడా ఈనెల 20వ తేదీలోగా ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి సవిత వెల్లడించారు. అర్హత ఉండి సాయం అందలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి పేద చేనేత కుటుంబానికి న్యాయం చేయడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని చెప్పారు. నేతన్నల ఇళ్లలో ఆనందం చూడాలనే తపనతోనే ఈ పథకాన్ని వేగవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్

అదానీకి భారీ ఊరట

Updated Date - Aug 14 , 2026 | 12:19 PM