నేపాల్ వరదల్లో గల్లంతైన, చిక్కుకున్న ఏపీ యాత్రికుల వివరాలు ఇవే..
ABN , Publish Date - Aug 27 , 2026 | 03:56 PM
మెరుపు వరదల కారణంగా నేపాల్‌లో చిక్కుకున్న, గల్లంతైన ఏపీ యాత్రికుల వివరాలను ఏపీ అధికారులు భారత రాయబార కార్యాలయానికి అందజేశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: మెరుపు వరదల కారణంగా నేపాల్‌లో చిక్కుకున్న, గల్లంతైన ఏపీ యాత్రికుల వివరాలను ఏపీ అధికారులు భారత రాయబార కార్యాలయానికి అందజేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
చొప్పరపు రమేశ్‌బాబు (53) . ఆగస్టు 26 ఉదయం 8:13 గంటలకు చైనా సరిహద్దు ఇమ్మిగ్రేషన్ వద్ద చివరిసారిగా గుర్తించారు. రిచా టూర్స్ ద్వారా అత్యవసరంగా ఆచూకీ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి.
అన్నందేవర వెంకట్రామ్ (52) – ఆగస్టు 25 రాత్రి రసువా–టిమురే (టిబెట్ సరిహద్దు) ప్రాంతంలో చివరిసారిగా గుర్తించారు.
అన్నందేవర ఆనాఘ (49) – ఆగస్టు 25 రాత్రి రసువా–టిమురే ప్రాంతంలో చివరిసారిగా గుర్తించినట్లు సమాచారం.
బాలసుబ్రహ్మణ్యం – గల్లంతైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆచూకీ తెలియదు. అత్యవసర గాలింపు కొనసాగుతోంది.
శశికుమార్ అట్లూరి – చైనాలోని గ్యిరోంగ్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్ద చివరిసారిగా గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ప్రాంతాన్ని నిర్ధారించాల్సి ఉంది.
రాజ్యలక్ష్మి నిమ్మగడ్డ – గ్యిరోంగ్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్ద చివరిసారిగా గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ప్రాంతాన్ని నిర్ధారించాల్సి ఉంది.
భాస్కర్ శాస్త్రి సహా మరో ముగ్గురు – సురక్షితంగా ఉన్నప్పటికీ అక్కడే చిక్కుకుపోయారు. తరలింపు చర్యలు, వ్యక్తిగత వివరాల సేకరణ అవసరం.
అపర్ణ కాకాని – ఆగస్టు 26 సాయంత్రం వరకు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఆమె పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వరదల ప్రభావం లేదు.. క్షేమంగా ఉన్నాం: సతీష్ రెడ్డి
సీటు కోసం పెద్దాయన మాస్ స్కెచ్.. వీడియో వైరల్