Share News

అగ్నికీలల్లో మరో ట్రావెల్‌ బస్సు

ABN , Publish Date - Nov 27 , 2026 | 05:20 AM

ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ప్రమాదాలు ఆగడంలేదు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం వరగలి క్రాస్‌ రోడ్డు సమీపంలో ఓ ట్రావెల్‌ బస్సు కాలి బూడిదైంది.

అగ్నికీలల్లో మరో ట్రావెల్‌ బస్సు

  • డ్రైవర్‌ అప్రమత్తతతో తప్పిన ప్రాణనష్టం

  • నెల్లూరు జిల్లాలో ప్రమాదం

చిల్లకూరు, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ప్రమాదాలు ఆగడంలేదు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం వరగలి క్రాస్‌ రోడ్డు సమీపంలో ఓ ట్రావెల్‌ బస్సు కాలి బూడిదైంది. డ్రైవర్‌ సకాలంలో మంటలను గుర్తించడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. విశాఖపట్నం నుంచి బుధవారం రాత్రి 34 మంది ప్రయాణికులతో ట్రావెల్‌ బస్సు బెంగళూరు బయలుదేరింది. గురువారం వేకువన చిల్లకూరు మండలంలోని వరగలిక్రాస్‌ రోడ్డు కూడలి వద్దకు బస్సు రాగానే వెనుక భాగంలో మంటలు రావడానికి డ్రైవర్‌ బస్సు అద్దం నుంచి గమనించాడు. వెంటనే ఫైర్‌బెల్‌ మోగించి బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. ప్రయాణికులు అప్రమత్తమై బస్సులో నుంచి కిందకి దిగి ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు

బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా

Updated Date - Nov 27 , 2026 | 05:22 AM