Share News

కూటమి గ్రాఫ్‌ మరింత పైకి

ABN , Publish Date - Nov 22 , 2026 | 02:30 AM

రాష్ట్రంలో కూటమి మరింత బలపడితే, వైసీపీ పట్ల ప్రజల్లో ఆదరణ మరింత తగ్గిందని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం మీడియా సమావేశంలో ...

కూటమి గ్రాఫ్‌ మరింత పైకి

  • 2024 కన్నా 2026లో ఎక్కువ ఆదరణ

  • గణాంకాలతో వివరించిన చంద్రబాబు

అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి మరింత బలపడితే, వైసీపీ పట్ల ప్రజల్లో ఆదరణ మరింత తగ్గిందని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన 2024 సార్వత్రిక ఎన్నికలను, తాజా స్థానిక సంస్థల ఎన్నికలను పోలుస్తూ గణాంకాలతో సహా వివరించారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2026 స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఓట్ల శాతం 55.3శాతం నుంచి 58.9శాతంకి పెరిగిందని చెప్పారు.

3.6శాతం ఓట్ల పెరుగుదలను నమోదు చేసిందని వివరించారు. మరోవైపు వైసీపీ ఓట్ల శాతం 39.81శాతం నుంచి 33.56శాతంకి తగ్గిపోయిందని తెలిపారు. వైసీపీ ఓట్ల శాతంలో 6.25శాతం తగ్గుదల నమోదైందని చెప్పారు. దీనితో కూటమి, వైసీపీ మధ్య ఓట్ల వ్యత్యాసం ఏకంగా 25.34 శాతానికి చేరుకుంది. ఆయన చెప్పిన


వివరాల ప్రకారం..

  • జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో మొత్తం 42(22 చైర్‌పర్సన్‌, 20 వైస్‌ చైర్‌పర్సన్‌) పదవులకు గానూ 29 పదవులు అంటే 69శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకు దక్కాయి. 24 ఉపకులాలకు ప్రాతినిధ్యం కల్పించారు.

  • బీసీలకు 17(40.5 శాతం), ఎస్సీలకు 6(14.3 శాతం), ఎస్టీలకు 3(7.1 శాతం), ముస్లింలకు 3(7.1 శాతం) పదవులు కేటాయించారు. ఓసీల్లోని అన్ని కులాలకు కలిపి 13 స్థానాలు అంటే 31 శాతం పదవులు కేటాయించారు.

  • బీసీలలో.. యాదవులకు 3, బోయలకు 2, శెట్టిబలిజకు 2, అగ్నికుల క్షత్రియ, గవర, గౌడ, కొప్పుల వెలమ, కురబ, నగరాలు, నాగవంశం, తూర్పు కాపు, వాడబలిజ, వన్నెకుల క్షత్రియకు ఒక్కొక్కటి చొప్పున పదవులు ఇచ్చారు. ఎస్సీల్లో.. మాదిగకు 4, మాలకు 2 పదవులు ఇచ్చారు. ఎస్టీల్లోనూ.. కమ్మర, కొండదొర, కొండరెడ్లుకు ఒక్కో పదవి ఇచ్చారు. ఓసీల్లో కమ్మకు 5, రెడ్డికి 5, బలిజ, కాపు, క్షత్రియకు ఒక్కొక్కటి చొప్పున పదవులు దక్కాయి. ముగ్గురు ముస్లింలకు పదవులు ఇచ్చారు.

  • 22 జడ్పీ చైర్‌పర్సన్‌ స్థానాల్లో 12, 20 వైస్‌ చైర్‌పర్సన్‌ స్థానాల్లో 11 మహిళలకు ఇచ్చారు.

  • యువత, ఉన్నత విద్యావంతులకూ ప్రాధాన్యమిచ్చారు. ఎన్నికైన వారిలో 40.5 శాతం(17 మంది) 40 ఏళ్లలోపు వారే కావడం విశేషం. మొత్తం పదవుల్లో 60 ఏళ్లు దాటిన వారు ఐదుగురే ఉన్నారు.

సామాజిక సమీకరణాలు

  • టీడీపీ గెలిచిన 70 స్థానాల్లో 27 సామాజిక వర్గాలకు అవకాశం కల్పించారు. 62.9శాతం(44 పదవులు) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మై నారిటీలకు దక్కాయి. బీసీలకు 25, ఎస్సీలకు 9, మైనారిటీలకు 9(వీరిలో 6 మంది మహిళలు), ఎస్టీలకు 1 పదవి లభించింది.

10 మేయర్‌ స్థానాల్లో

  • టీడీపీ గెలిచిన 10 మేయర్‌ పదవులను 10 వేర్వేరు సామాజిక వర్గాలకు(నాగవంశం, తూర్పు కాపు, ముస్లిం, కమ్మ, కాపు, యాదవ, రెడ్డి, మాదిగ, బలిజ, ఈడిగ) కేటాయించారు.


నగరాలకు మహిళా సారథ్యం

  • టీడీపీకి దక్కిన 70 స్థానాల్లో 60శాతం (42 స్థానాలు) మహిళలకే ఇచ్చారు. 10 మేయర్‌ స్థానాల్లో 8(విశాఖపట్నం, విజయనగరం, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, కడప, కర్నూలు, చిత్తూరు) మహిళలే.

విద్యావంతులు, యువత

  • 70 మందిలో 78.6శాతం మంది డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదివినవారు(11 మంది పీజీలు) ఉన్నారు. 31 మంది 45 ఏళ్లలోపు యువకులు ఉన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?

కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి

Updated Date - Nov 22 , 2026 | 02:34 AM