అమరావతిపై పనిగట్టుకుని దుష్ప్రచారం
ABN , Publish Date - Oct 03 , 2026 | 05:24 AM
కొందరు అమరావతిపై పనిగట్టుకుని దుష్ప్రచారం సాగిస్తున్నారని మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన విలేకరుల సమావేశంలో..
మంత్రి నారాయణ
పొన్నూరు, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): కొందరు అమరావతిపై పనిగట్టుకుని దుష్ప్రచారం సాగిస్తున్నారని మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన విలేకరుల సమావేశంలో శుక్రవారం మంత్రి మాట్లాడారు. ‘రాజధాని అమరావతిలో పనులు పూర్తయితే చుక్కా నీరు నిలబడే అవకాశం లేదు. నెదర్లాండ్ టెక్నాలజీని రాజధాని నిర్మాణంలో వినియోగిస్తున్నాం. కొండవీటి వాగు, పాలవాగు గ్రావిటీ కెనాల్స్ అభివృద్ధితో రాజధాని ప్రాంతంలో చుక్క నీరు నిలిచే పరిస్థితి లేదు. 22 వేల క్యూసెక్కుల నీటిని బయటికి పంపించే విధంగా కాలువల నిర్మాణం జరిగింది’ అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి..
స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు
శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు