ఎక్స్ వేదికగా వైసీపీ అధినేత జగన్‌కు మంత్రి నారా లోకేష్ సవాల్
ABN , Publish Date - Mar 27 , 2026 | 09:39 PM
మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. అమరావతిపై జగన్ స్టాండ్ ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
అమరావతి, మార్చి 27: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. అమరావతిపై జగన్ స్టాండ్ ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని మా నినాదం. అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. అమరావతిపై మీ స్టాండ్ ఏంటి జే టర్న్ వైఎస్ జగన్ గారు?’ అని ప్రశ్నించారు. అమరావతి రాజధానిపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత.. 11 సార్లు మాట మార్చిన జగన్ వీడియోలను తన ట్వీట్‌కు జత చేశారు.
ఇవి కూడా చదవండి
కాంట్రాక్టర్‌పై రెచ్చిపోయిన భూపాలపల్లి కలెక్టరేట్ ఉద్యోగి..
ఆ విషయంపై ఇరాన్ సీరియస్.. గల్ఫ్ దేశాలకు వార్నింగ్!