Share News

సీఎం చంద్రబాబు పుట్టినరోజు.. మంత్రి లోకేశ్ భావోద్వేగ పోస్ట్..

ABN , Publish Date - Apr 20 , 2026 | 11:59 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం తన ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ పోస్టు పెట్టారు.

సీఎం చంద్రబాబు పుట్టినరోజు..  మంత్రి లోకేశ్ భావోద్వేగ పోస్ట్..
Nara Lokesh message Chandrababu

అమరావతి, ఏప్రిల్ 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం తన ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన స్ఫూర్తిదాయకమైన నాయకుడు. ఆయనను 'నాన్న' అని పిలిచే అదృష్టం నాకు ఉంది’..


‘ఏళ్లు గడిచే కొద్దీ ప్రజాసేవపై చంద్రబాబు తపన మరింత బలపడుతోంది. అనుభవం, దూరదృష్టితో ముందుండి నడిపిస్తున్న తీరు ఆదర్శప్రాయం. కష్టసమయంలో పట్టుదల, ప్రజల పట్ల అంకితభావం మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. చంద్రబాబు ఎల్లప్పుడు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా’ అని లోకేశ్ అన్నారు.


మీలో సగమై.. మీ కృషిలో భాగమై

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం చంద్రబాబుతో కలిసి బర్త్ డే కేక్ కట్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేశారు. ‘నా కోసం ఈ రోజు పుట్టావు. కోట్లాది మంది కోసం జీవిస్తున్నావు. మీలో సగమై... మీ కృషిలో భాగమై. నా స్వేచ్ఛా స్వతంత్ర సేవా సాధికార మార్గదర్శి.. పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ భూ’ అని రాసుకొచ్చారు.


ఇవి కూడా చదవండి

‘బతికుండగా మీరు అధికారంలోకి రారు’.. హరీశ్‌పై మంత్రి తుమ్మల ఫైర్

విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్‌ను అధిగమించిన పాక్ బ్యాటర్

Updated Date - Apr 20 , 2026 | 12:32 PM