డివైడర్‌ను ఢీకొని అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు.. పలువురికి గాయాలు..
ABN , Publish Date - Jul 12 , 2026 | 09:33 AM
నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టి అదుపుతప్పింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టి అదుపుతప్పింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక దర్యాప్తు వివరాల మేరకు.. ఓ ట్రావెల్స్ బస్సు శనివారం రాత్రి హన్మకొండ నుంచి తిరుపతి బయలు దేరింది. ఆదివారం తెల్లవారుజామున నంద్యాల జిల్లాలో ఆ బస్సు ప్రమాదానికి గురైంది.
రోడ్డుపై వేగంగా వెళుతున్న బస్సు డివైడర్‌ను ఢీకొట్టి అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
‘వాటర్ బార్లు’ వచ్చేస్తున్నాయ్...
హోర్ముజ్‌లో దాడి.. తమ తప్పిదమేనని ఇరాన్ నాయకులు అంగీకరించారా..