వైసీపీకి వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్టే.. ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 14 , 2026 | 09:44 PM
జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా లావేరులోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వం వైసీపీ తీరుపై, ఎన్నికల వ్యూహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
శ్రీకాకుళం, మార్చి 14: జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా లావేరులోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు(Naga Babu Konidela) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వం వైసీపీ(YCP) తీరుపై, ఎన్నికల వ్యూహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కలవకుండా వైసీపీ వంటి అనేక శక్తులు తీవ్రంగా ప్రయత్నించాయని నాగబాబు ఆరోపించారు. ఒకవేళ జనసేన విడిగా పోటీ చేసి, వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ప్రజలకు నరకం చూసి ఉండేవారని ఆయన పేర్కొన్నారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా క్షేమం కోసం పవన్ కల్యాణ్(Pawan Kalyan) రిస్క్ తీసుకొని కూటమిని ముందుకు నడిపారని కొనియాడారు.
ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని, పవన్ కల్యాణ్ సూచన మేరకు తాను అనకాపల్లి ఎంపీ సీటును వదులుకున్నానని నాగబాబు గుర్తుచేశారు. పదవుల కంటే పార్టీ సిద్ధాంతాలే తమకు ముఖ్యం అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వెంకటేశ్వర స్వామి లడ్డూలో కెమికల్స్ కలిపిన దుర్మార్గపు పార్టీ వైసీపీ. హిందూ మతాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. రఫ్ఫా..రఫ్ఫా.. అంటూ ప్రగల్భాలు పలికే వైసీపీ వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం ఖాయం. వైసీపీ నాయకులకు జనసేన కార్యకర్తలు ఎవరూ భయపడరు. గత 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాను. వైసీపీ ఓడిపోయినా కూడా బుద్ది రావడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
హోర్ముజ్ దాటిన 2 భారత ఎల్పీజీ నౌకలు.. ఫలించిన భారత్ దౌత్యం
సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధం రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం