Share News

నాదెండ్ల భాస్కరరావుకు ప్రముఖుల నివాళి

ABN , Publish Date - May 03 , 2026 | 04:19 AM

వయోభారంతో ఇటీవల మరణించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

నాదెండ్ల భాస్కరరావుకు ప్రముఖుల నివాళి

  • హైదరాబాద్‌లో నిర్వహించిన దశదిన కర్మకు పలువురు హాజరు

  • ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రికిని వాళులర్పించిన డిప్యూటీ సీఎం భట్టి

  • నాదెండ్ల కుమారుడు మనోహర్‌కు ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ పరామర్శ

హైదరాబాద్‌ సిటీ, మే 2 (ఆంధ్రజ్యోతి): వయోభారంతో ఇటీవల మరణించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. నాదెండ్ల భాస్కరరావు దశదినకర్మ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం నిర్వహించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,తోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాదెండ్ల భాస్కరరావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. భాస్కరరావు కుమారుడు, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్‌, ఆయన కుటుంబసభ్యులను ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ పరామర్శించారు. అలాగే, రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌ బాబు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌, మాజీ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు తదితరులు కూడా భాస్కరరావుకు నివాళులర్పించారు. అలాగే, ఏపీకి చెందిన మంత్రులు పయ్యావుల కేశవ్‌, అనిత, కొల్లు రవీంద్ర, సత్యకుమార్‌యాదవ్‌, టీజీ భరత్‌, డోలబాల వీరాంజనేయస్వామి, ఎంపీలు పుట్టా మహేష్‌, కేశినేని శివనాథ్‌, సుజనాచౌదరి, తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, ఏపీ టీడీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు కూన రవికుమార్‌, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,, పత్తిపాటి పుల్లారావు, బొమ్మిడి నాయకర్‌, కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధప్రసాద్‌ తదితరులు కూడా నాదెండ్లకు నివాళులర్పించారు. అలాగే, మాజీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి, సీపీఐ నాయకులు నారాయణ, జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి శంకర్‌గౌడ్‌, సినీ రంగం నుంచి నిర్మాత అల్లు అరవింద్‌, విశ్వప్రసాద్‌, తనీష్‌, ఆర్కే నాయుడు తదితరులు నాదెండ్లకు శ్రద్ధాంజలి ఘటించారు.

Updated Date - May 03 , 2026 | 04:19 AM