Share News

మున్సిపల్‌ కార్మికుడి కుటుంబానికి 33 లక్షలు

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:00 AM

విధి నిర్వహణలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వెల్డర్‌ ఉండి అనిల్‌కుమార్‌ కుటుంబానికి..

మున్సిపల్‌ కార్మికుడి కుటుంబానికి 33 లక్షలు

అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వెల్డర్‌ ఉండి అనిల్‌కుమార్‌ కుటుంబానికి ప్రభుత్వం రూ.33.15 లక్షల ఆర్థిక సాయం అందించింది. బీమా ప్రయోజనాలకు సంబంధించిన చెక్కును మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్‌కుమార్‌ బాధితుడి కుటుంబానికి అందజేశారు. 51 ఏళ్ల అనిల్‌కుమార్‌ 2020 ఏప్రిల్‌ నుంచి మున్సిపల్‌ శాఖలో వెల్డర్‌గా పనిచేస్తున్నారు. జూన్‌ 12న విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

ఈ వార్తలనూ చదవండి..

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్

హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Updated Date - Sep 26 , 2026 | 05:00 AM