అధికారులు నిజాయితీగా విధులు నిర్వర్తించాలి
ABN , Publish Date - Oct 18 , 2026 | 03:51 AM
ఎక్సైజ్ శాఖలో కొత్తగా నియమితులైన అధికారులు నిజాయితీ, క్రమశిక్షణతో ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పని చేయాలని..
ఎక్సైజ్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్లో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా
అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్ శాఖలో కొత్తగా నియమితులైన అధికారులు నిజాయితీ, క్రమశిక్షణతో ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పని చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, గనులు, భూగర్భ శాఖల ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా పిలుపునిచ్చారు. ఎక్సైజ్ చట్టాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో నియమితులైన నియమితులైన 147 మంది అధికారులు హైదరాబాద్లోని హిమాయత్సాగర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో ఆరు నెలలపాటు ప్రాథమిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు
దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ