ఎల్‌కోటలో తల్లీకూతుళ్ల పోరు
ABN , Publish Date - Nov 26 , 2026 | 06:09 AM
మార్కాపురం జిల్లా కంభం మండలం ఎల్.కోట గ్రామ పంచాయతీలో తల్లీకూతుళ్ల మధ్య ఆసక్తికర పోటీ జరుగుతోంది. సర్పంచ్ పదవికి మరో నలుగురు పోటీ చేస్తున్నా..
కంభం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): మార్కాపురం జిల్లా కంభం మండలం ఎల్.కోట గ్రామ పంచాయతీలో తల్లీకూతుళ్ల మధ్య ఆసక్తికర పోటీ జరుగుతోంది. సర్పంచ్ పదవికి మరో నలుగురు పోటీ చేస్తున్నా.. ప్రధాన పోటీ తల్లీకూతుళ్ల మధ్యే ఉంది. తల్లి గని నారాయణమ్మ గతంలో టీడీపీ మద్దతుతో సర్పంచ్‌గా, ఎంపీటీసీగా గెలుపొందారు. ఇప్పుడు మూడోసారి పోటీ చేస్తున్నారు. ఆమె కుమార్తె తాటికొండ లక్ష్మీదేవి కూడా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని నారాయణమ్మకు ఎమ్మెల్యే నచ్చజెప్పినా.. పోటీలో ఉంటానని పట్టుబట్టినట్లు తెలిసింది.
ఈ వార్తలనూ చదవండి:
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్