నిరుద్యోగుల జీవితాల్లో ఇది చరిత్రాత్మకం: ఎమ్మెల్సీ వేపాడ
ABN , Publish Date - Nov 29 , 2026 | 05:37 AM
నిరుద్యోగుల జీవితాలలో 2026 చరిత్రాత్మక సంవత్సరమని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి అన్నారు.
నిరుద్యోగుల జీవితాలలో 2026 చరిత్రాత్మక సంవత్సరమని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ల కృషితో 1,500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 2,700లకు పైగా రెండో డీఎస్సీ, 700లకు పైగా గ్రూప్-2 పోస్టులు, 500లకు పైగా ఏఈఈ పోస్టులతో పాటు గ్రూప్-1, డైట్, ఎస్ఈఆర్టి, లెక్చరర్, ఫారెస్ట్, కానిస్టేబుల్, ఎస్ఐ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే.
6,100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ఉగాదినాడు లోకేశ్ ప్రకటించిన 10,060 పైగా ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. వైసీపీ అబద్ధపు ప్రచారాన్ని నిరుద్యోగ యువత నమ్మవద్దు’ అని ఎమ్మెల్సీ వేపాడ పిలుపునిచ్చారు.
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..